నల్ల ఎండు ద్రాక్షతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నల్ల ఎండు ద్రాక్షతో ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ ఏ కళ్ల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
వీటిలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ముఖ్యంగా గుండె సమస్యల నుంచి కాపాడుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రక్తపోటు కూడా తగ్గుతుందని సూచిస్తున్నారు.