గర్భిణీలు జామపండు తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జామపండ్లలో విటమిన్-సి, విటమిన్-ఎ, విటమిన్-బి6, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. విటమిన్ బి.. పిండం అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. గర్భధారణ సమయంలో రోగనిరోధక శక్తి బలంగా ఉండేలా చేస్తాయి. గర్భిణీ స్త్రీలు రోజుకు 100 నుంచి 150 గ్రాముల వరకు జామ పండ్లు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.