పుదీనా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. దీని గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఇది ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది.అందుకే ఈ పుదీనా మొక్కను సహజ ఔషధ మొక్కగా చెబుతూ ఉంటారు. అయితే ఇది జలుబు మరియు దగ్గు, నోటి సమస్యలు, గొంతు మంట, సైనస్ ఇన్ఫెక్షన్, శ్వాస కోస ఇన్ఫెక్షన్ లను దూరం చేయటంలో కూడా హెల్ప్ చేస్తుంది. అయితే నోరు లేక గొంతు మంటను తగ్గించేందుకు ఈ మొక్క ఔషధంలా పని చేస్తుంది. ఈ పుదీనా అనేది క్యాన్సర్ అభివృద్ధి కారకాలను కూడా తగ్గిస్తుంది. అలాగే దీనిలో ఉండే యాంటీ మైక్రో బయల్ మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఆరోగ్యంగా ఉండటానికి హెల్ప్ చేస్తాయి. ఇది జీర్ణ ఆరోగ్యానికి సహాయ పడటమే కాక అలర్జీ లక్షణాలను కూడా నియంత్రిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అందుకే పుదీనాను నిత్యం ఖచ్చితంగా తీసుకోవాలి అని వైద్యులు చెబుతూ ఉంటారు. అయితే వీటిని రోజుకు ఐదు నుండి ఆరు ఆకులను నమిలి తీసుకోవాలి అని అంటున్నారు…
1. పుదీనా రసం లేక పుదీనా ఉన్నటువంటి ఆహారాలను నిత్యం కచ్చితంగా తీసుకోవడం వలన ఛాతిలోని సమస్యలను కూడా నియంత్రించవచ్చు. పుదీనాలో ఉన్నటువంటి మెంథాల్ డికాంగెస్టెంట్ గా పని చేస్తుంది. ఇది ఊపిరితిత్తులో పేర్కొన్న శ్లేషాన్ని కూడా బయటకు పంపిస్తుంది. మీరు ఈజీగా శ్వాస తీసుకోవడానికి సహాయపడే ముక్కులో ఉన్న పొరలను కుదించటం మొదలు పెడుతుంది.
2. పుదీనాలో ఉన్నటువంటి ఔషధ గుణాలు దాని యొక్క సువాసన అరోమాథేరఫీ లో ఉపయోగపడతాయి. ఈ పుదీనా అనేది రిఫ్రెష్ వాసున ను కూడా కలిగి ఉంటుంది. ఇది మిమ్మల్ని ఎంతో తొందరగా ప్రశాంతంగా మరియు రిఫ్రెష్ గా ఉండేలా చేస్తుంది. అయితే ఈ పుదీనా రసం మరియు దాని యొక్క వాసన అనేది తొందరగా మానసిక ఒత్తిడి మరియు డిప్రెషన్ నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.
3. ఈ పుదీనా ఆకులను నమలడం వలన నోటి శుభ్రత మరియు దంత ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో కూడా ఉపయోగపడుతుంది. ఈ పుదీనా నూనె అనేది తాజా శ్వాస ను పొందేందుకు కూడా హెల్ప్ చేస్తుంది.
4. మీరు పుదినాను వాడడం వలన చర్మ వ్యాధులు అనేవి దూరమవుతాయి. దీంతో శరీర ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది.
5. పుదీనా ఆకుల రసంలో తేనె లేక ఎర్రరాతి పంచదార మరియు నిమ్మరసాన్ని కలిపి తీసుకుంటే అలసట మరియు నీరసం, జీర్ణ సమస్యలను కూడా దూరం చేస్తుంది. అలాగే మనస్సును కూడా ఎంతో రిఫ్రెష్ చేస్తుంది.
6. ప్రతిరోజు కూడా నాలుగు పుదీనా ఆకులను నమిలి తీసుకోవడం వలన పంటి నొప్పి మరియు దవడలో రక్తస్రావన్ని తగ్గించి చిగుళ్ళను బలంగా చేస్తుంది. అలాగే నోటి దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.
7. పుదీనా ఆకులతో చూర్ణం తయారు చేసుకొని తీసుకోవటం వలన తలనొప్పి మరియు తల తిరగడం లాంటి సమస్యలను కూడా నియంత్రిస్తుంది. అలాగే పుదీనా కషాయాన్ని తేనెతో కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది…