కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు భారీ షాక్ ఇచ్చింది. వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని 20 శాతం వరకు పెంచేసింది. దీంతో సన్‌ఫ్లవర్, సోయాబీన్, రిఫైన్డ్ పామాయిల్, వేరుశనగపై ఇంపోర్ట్ టాక్స్ 12.5 శాతం నుంచి 32.5 శాతానికి చేరింది.
అన్ని రకాల నూనెల ధరలు లీటర్‌పై ఒక్కసారిగా రూ.15-20 వరకు పెరిగాయి. పామాయిల్ ధర రూ.100 నుంచి రూ.115-120, సన్‌ఫ్లవర్ రూ.115 నుంచి రూ.130-140, వేరుశనగ నూనె రూ.155 నుంచి రూ.165-170కు చేరింది.