అతిగా యాంటీబయోటిక్స్ వాడితే అత్యవసర పరిస్థితుల్లో అవి పనిచేయవని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటి వినియోగం ఎక్కువైతే వచ్చే 'యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ (AMR)' గురించి లాన్సెట్ అధ్యయనం తాజాగా హెచ్చరించింది.
2019లో 10.4 లక్షల మరణాలు బ్యాక్టీరియా AMRతో ముడిపడి ఉన్నాయని, వీటిలో 2.9 లక్షల మరణాలకు నేరుగా వ్యాధికారక బ్యాక్టీరియా దాడి కారణమని అధ్యయనం తెలిపింది. యాంటిబయోటిక్స్ ను అతిగా తీసుకోవడంతో వ్యాధి కారక బ్యాక్టీరియాకు క్రమంగా ఆ దాడిని ఎదుర్కొనే శక్తి రావడాన్నే AMR అంటారు.