గ్రేటర్ హైదరాబాద్‌లోని మూసీ పరివాహక ప్రాంతాలు.. కాలుష్య పరిశ్రమల పరిధిలోని జలయాశయాల్లో ప్రమాదకర ‘సూపర్ బగ్ బ్యాక్టీరియా’ ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. యాంటీ బయాటిక్స్‌కు లొంగని ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశిస్తే తీవ్ర అనారోగ్యానికి గురవుతారని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ విషయం తాజాగా ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌సిస్టమ్స్’ అనే సంస్థతో కలిసి జర్మన్ పరిశోధకులు నగరంలో నిర్వహించిన పరిశోధనలో తేలింది.