అన్నం తిన్న వెంటనే టీ తాగితే జీర్ణవ్యవస్థకు, పోషక పదార్థాల శోషణకు ఆటంకం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. టీలో ఉండే టానిన్లు, కెఫీన్ వంటి రసాయనాలు జీర్ణ ప్రక్రియను మందగింపజేస్తాయి.
కడుపులో ఆమ్లత పెరిగిఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. టీలో ఉండే ఫాస్ఫారిక్ యాసిడ్ ఎముకల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కెఫీన్ రక్తపోటును పెంచుతుంది. భోజనం తర్వాత టీ తాగితే నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.