వచ్చే ఏడాది జరగనున్న ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుని వీడి పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్‌గా మంగళవారం అతడు ఒప్పందం కుదుర్చుకున్నాడని కథనాలు వెలువడుతున్నాయి. తన దేశానికే చెందిన ట్రెవర్ బేలిస్ స్థానంలో ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు.పాంటింగ్ మంగళవారమే ఒప్పందంపై సంతకం చేశాడని, నాలుగు సంవత్సరాలపాటు కోచ్‌గా కొనసాగనున్నాడని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. పటిష్టమైన జట్టును రూపొందించేందుకు పాంటింగ్‌కు తగిన సమయం ఉందని, మిగతా సహాయక సిబ్బందిపై పాంటింగ్ నిర్ణయం తీసుకుంటాడని వివరించాయి. కాగా రికీ పాంటింగ్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు దాదాపు ఏడేళ్ల పాటు పని చేశాడు. అతడి ఆధ్వర్యంలో 2020లో ఫైనల్‌కు చేరినప్పటికీ టైటిల్ దక్కలేదు. ఇక ముంబై ఇండియన్స్ జట్టుకు కూడా కోచ్‌గా పాంటింగ్ పనిచేశాడు. ఇదిలావుంచితే 2008లో ఐపీఎల్ ప్రారంభమవగా.. పంజాబ్ కింగ్స్ జట్టు ఒక్కసారి కూడా ఐపీఎల్‌ని గెలవలేదు. ఆస్ట్రేలియాకు ప్రపంచ కప్‌లు అందించిన కెప్టెన్‌గా పాంటింగ్ చక్కటి అనుభవం ఉండడంతో పంజాబ్ కింగ్స్ సహ-యజమానులు అతడి వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.