మన శరీరాన్ని అనేక రకాల వ్యాధుల నుంచి కాపాడే వాటిలో అల్లం ఒకటి. అల్లం మన శరీరాన్ని ఎన్నో రకాల వ్యాధుల నుంచి కాపాడడమే కాకుండా ఎన్నో రకాల సమస్యలను తొలగిస్తుంది.ముఖ్యంగా అల్లం జీర్ణక్రియను మెరుగుపరచడానికి, జీవక్రియను పెంచడానికి ముఖ్య పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గడానికి అల్లం చక్కగా పనిచేస్తుంది. ప్రతిరోజు అల్లం రసం తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగే ప్రక్రియను ప్రోత్సహిస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఫ్రీరాడికల్స్ సమస్యల నుంచి రక్షిస్తాయి. అల్లం రసం ఆయుర్వేద పానీయం. ఇది కొన్ని శతాబ్దాలుగా ఆయుర్వేద ఔషధంగా పనిచేస్తుంది. పూర్వకాలం నుంచి అల్లాన్ని ఆయుర్వేదంలో చాలా రకాలుగా వాడేవారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల జీర్ణక్రియను ప్రోత్సహించే లక్షణాలతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పెంపొందిస్తుంది. అల్లంలో జింజెరోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అల్లం జ్యూస్ కడుపునొప్పి వంటి సమస్యలను నివారిస్తుంది. కీళ్ల నొప్పులు, తలనొప్పి, కండరాల సమస్యలను అల్లం తొలగిస్తుంది. ముఖ్యంగా వాంతులు, వికారం వంటి వాటిని తొలగించడంలో అల్లం ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే చాలామంది తలనొప్పి వంటి సమస్యతో బాధపడిన సమయంలో కొద్దిగా అల్లం వేడి నీటిలో వేసి మరిగించుకొని తాగినట్లయితే తలనొప్పి చిటికెలో మాయం అవుతుంది. ఇది శరీరంలో వచ్చే నీరసం వంటి సమస్యలను సులభంగా తొలగిస్తుంది. ప్రతిరోజు మనం పానీయం లేదా ఆహారం రూపంలో తప్పకుండా అల్లాన్ని చేర్చుకోవాలి. దాని వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. బీపీ పేషెంట్లు, గుండె పేషెంట్లు, డయాబెటిక్ పేషెంట్లు తప్పకుండా ప్రతిరోజు అల్లం టీని తాగాలి. దానివల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు తొలగిపోతాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు.