భారతదేశంలో ప్రతి సంవత్సరం గుండెపోటు కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతున్నారు.. కాబట్టి ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.మన దేశంలో, ప్రజలు ఎక్కువ నూనె, అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. ఇది రుచికరంగా ఉండవచ్చు.. కానీ గుండె ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. కొవ్వును పెంచడంతోపాటు.. బీపీ.. గుండె సమస్యలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితిలో వాల్ నట్స్ తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.. వాల్‌నట్స్‌లో ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, పాస్పరస్ వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తి పెంచడంలో, ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి..
వాస్తవానికి ప్రతి డ్రై ఫ్రూట్ తినడం ఆరోగ్యానికి ప్రయోజనకరమే.. అయినప్పటికీ, మీరు వాల్‌నట్‌లను తీసుకుంటే అది గుండె ఆరోగ్యానికి ఔషధం కంటే తక్కువ ఏం కాదు.. గుండె మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం.. దానిని ఆరోగ్యంగా ఉంచడానికి శరీరంలో ఎలాంటి పోషకాల కొరత ఉండకూడదు.. అందుకే వాల్‌నట్స్ తీసుకోవడం చాలామంచిదంటున్నారు వైద్య నిపుణులు.. అయితే.. వాల్ నట్స్ ఎలా మేలు చేస్తాయి.. ఎలాంటి హాని కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.వాల్‌నట్‌లు గుండెకు ఎందుకు మేలు చేస్తాయి?: వాల్‌నట్‌లు స్టెరాల్స్, మొక్కల ఆధారిత ఒమేగా-3 కొవ్వు ఆమ్లాల గొప్ప మూలంగా పరిగణిస్తారు. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న లినోలెనిక్ ఆమ్లం కూడా ఇందులో పుష్కలంగా ఉంటుంది. రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే, అది మొదట రక్తపోటును పెంచి, ఆపై గుండెపోటు వంటి గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని గుర్తుంచుకోండి. శాకాహారులు ముఖ్యంగా వాల్‌నట్‌ల వినియోగం ద్వారా అపారమైన ప్రయోజనాలను పొందవచ్చు.. ఎందుకంటే ఒమేగా -3, 6 ఫ్యాటీ యాసిడ్‌ల రోజువారీ అవసరాలు దాని ద్వారా నెరవేరుతాయి.
డయాబెటిస్‌లో కూడా ప్రభావవంతంగా ఉంటుంది: వాల్‌నట్స్‌లో పోషకాలకు కొరత లేదు.. ఫైబర్, విటమిన్ ఇ, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఇందులో లభిస్తాయి. దీన్ని తినడం వల్ల గుండెపోటు రాకుండా ఉండటమే కాకుండా టైప్ 2 డయాబెటిస్ నిర్వహణలో కూడా సహాయపడుతుంది.వాల్‌నట్‌లను ఎక్కువగా తినడం హానికరం: వాల్‌నట్‌లో పోషకాలు సమృద్ధిగా ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.. కానీ బలహీనమైన వ్యక్తులు 10-12 ముక్కల వాల్‌నట్‌లను తినవచ్చు. ఆరోగ్యకరమైన వ్యక్తులు 6-7 ముక్కలు తినవచ్చు. ఇంతకు మించి తినడం హానికరం.గుండె జబ్బు ఉన్నవారు వాల్‌నట్‌లను 2 నుంచి 4 ముక్కలు మాత్రమే తినాలి. ఇది ఎక్కువగా తింటే, కేలరీలు పెరుగుతాయి.. ప్రయోజనాలకు బదులుగా హాని జరుగుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (ఈ సమాచారం ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది.