పుట్టగొడుగుల్లా పుట్టుకోస్తున్న బిర్యానీ సెంటర్లు, ఫాస్టుఫుడ్ సెంటర్ లు "కాదేదీ కల్తీకనర్హం" అన్నట్లు దుబ్బాక నియోజకవర్గం లో ఆహార కల్తీ జోరుగా సాగుతోందన్న ఆరోపణలు ఉన్నా సంబంధిత అధికారులు ఇటువైపు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వినిపిస్తు న్నాయి. హెూటళ్లు, రహదారుల పక్కన ఉండే దాబాలు, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, ప్రజలు సహజంగా తినే ఆహార పదార్థాలను నిత్యం పరిశీలించి కల్తీ కాకుండా చూడాల్సిన వారు నెలల తరబడి ఇటువైపు చూడటం లేదన్న వాదన వ్యక్తమవుతోంది. కొన్నింటిలో మొక్కుబడిగా తనిఖీలు చేసి నమూనాలను తీసుకున్నా చివరికి సదరు హెూటల్, లేదా దుకాణ యాజమాన్యంతో సెటిల్మెంట్ చేసుకొని కేసు కాకుండా చేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల వ్యాప్తంగా పెద్ద పెద్ద హెూటళ్లతో పాటు రహదారి పక్కన , బిర్యానీ సెంటర్ లు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద పెద్ద కార్పొరేట్ స్థాయిలో ఉండటంతో ఇక్కడకు అధికారులు తనిఖీలకు రాకుండా సంబంధిత అధికారులకు
నెల వారీగా ముడుపులు పంపిస్తున్నారన్న ఆరోపణలు సదరు శాఖలోనే వినిపిస్తున్నాయి. రెగ్యూలర్ అధికారులు లేక "పోవడం, తనిఖీలు నిరంతరం జరగకపోవడంతో కొన్ని హె టళ్లలో ధరలు బహిరంగ మార్కెట్లతో పోలిస్తే సుమారు నాలుగై దింతలు ఎక్కువగా ఉంటున్నాయి. అయినా దీనిపై చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులు ముందుకు రావడం లేదు. ప్రస్తుతప్రపంచంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా నూనె ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో, అక్రమార్కులు
కల్తీ వైపు ఎక్కువగా దృష్టి సారించారు.
జరిమానాలకే పరిమితమా.?
దుబ్బాక మండలం సిద్దిపేట జిల్లా కు 27కిలోమీటర్లు అయితే సిద్దిపేట పట్టణంలో పదుల సంఖ్యలో నూనే మిల్లులు ఉన్నాయి. ఇందులో కొన్ని లూజ్ నూనేను విక్రయిస్తున్నాయి. ఇలా లూజ్ నూనే విక్రయించడం నిబంధనలకు విరుద్ధం. అయినా సంబంధిత శాఖ పర్యవేక్షణ లేకపోవడంతో ఇందులో ఇతర నూనెలను కలిపి వాటిని కల్తీ చేస్తున్నారు. కొన్నింటిలో కేసులు నమోదు చేసి మొక్కుబడి జరిమానా విధించి వది లేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్తీ నూనె వాడుతున్న దాబాలు, రెస్టారెంట్, హెూటల్స్, పాస్ట్ ఫుడ్ సెం టర్ లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.