ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రతి రోజూ ఉసిరి తినడం వల్ల

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Sep 21, 2024, 02:03 PM

ఉసిరి కాయ ఆరోగ్యానికి మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. ఉసిరితో ఆరోగ్య సమస్యలు, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు తగ్గించుకోవచ్చు.ఆల్ ఇన్ వన్‌గా ఉసిరి పని చేస్తుంది. ప్రాచీన కాలం నుంచి కూడా ఉసిరిని ఔషధంగా తీసుకుంటూ ఉంటారు. ఉసిరిని నేరుగా తిన్నా.. జ్యూస్ తాగినా ఆరోగ్యానికి చాలా మంచిది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, క్యాల్షియం, ఫాస్పరస్,ఐరన్, కెరోటిన్, బీ కాంప్లెక్స్‌తో పాటు మనిరల్స్ వంటివి కూడా లభిస్తాయి. ఉసిరిని ఎలా తీసుకున్నా శరీరానికి పోషకాలు అందుతాయి. అయితే ముఖ్యంగా ప్రతి రోజూ ఉదయం పరగడుపున ఉసిరి తినడం వల్ల మరింత బెటర్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి కాయ నమిలి తినడం వల్ల ఎలాంటి ఉపయోగలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ఖాళీ కడుపుతో ప్రతి రోజూ ఉసిరి తినడం వల్ల డయాబెటీస్‌ని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి ఎంతో దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిన అదుపులో ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది.


అధిక బరువు తగ్గాలి అనుకునే వారు ఉసిరి తినడం వల్ల మంచి ఫలితాలు అందుకుంటారు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఉసిరిలో ఫైబర్ అనేది ఎక్కువగా లభిస్తుంది. ఇది త్వరగా ఆకలి వేయకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఉసిరిలో ఉండే పోషకాలు గట్ హెల్త్‌కి చాలా మంచి చేస్తుంది. మల బద్ధకం సమస్య, చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుంది.


 


ఉసిరి కాయ నమిలి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గునాలు, యాంటీ గ్లైసమిక్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో చక్కగా హెల్ప్ చేస్తుంది


ఉసిరి నమిలి తినడం వల్ల చర్మం, జుట్టు సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. ముడతలు, మొటిమలు, మచ్చలు తగ్గి చర్మం క్లియర్‌గా అవుతుంది. చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. ఉసిరి తినడం వల్ల జుట్టు కూడా ఆరోగ్యంగా, బలంగా తయారవుతుంది. జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. కుదుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. జుట్టు కూడా నిగనిగలాడుతూ ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com