దేశీయ డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ పేమెంట్లు అగ్రస్థానంలో ఉన్నాయి. కిరాణా దుకాణం నుంచి హాస్పిటల్స్ బిల్లుల వరకు యూపీఐ ద్వారానే చెల్లిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో UPI లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై లోకల్ సర్కిల్స్ సర్వే 42,000 మంది నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఛార్జీలు విధిస్తే యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయడం ఆపేస్తామని దాదాపు 75 శాతం మంది చెప్పగా.. 25 శాతం మంది రుసుము విధించినా పర్లేదని పేర్కొన్నారు.