ఎయిర్ కండిషనర్లు(AC) ఇండోర్ ఉష్ణోగ్రతలు, తేమను నియంత్రించడంలో సహాయపడతాయి. మరింత సౌకర్యవంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అయితే ACని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్స్ వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. AC వల్ల గదిలో గాలి పొడిగా మారుతుంది. దీంతో చర్మం పొడిబారడం, దురద, కంటి చికాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. అలాగే శ్వాసకోశ సమస్యలతోపాటు దగ్గు, ఉబ్బసం, అలెర్జీలు, తలనొప్పి వంటి అనేక ఆరోగ్య సమస్యలొస్తాయని హెచ్చరిస్తున్నారు.