ఎలాన్ మస్క్‌కు చెందిన ‘స్పేస్ఎక్స్’ చేపట్టిన ప్రతిష్ఠాత్మక ‘స్టార్‌షిప్’ ఐదో ప్రయోగం విజయవంతమైంది. ఆదివారం ఉదయం టెక్సాస్ దక్షిణ తీరం నుంచి ఈ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
రెండు దశల ఈ భారీ రాకెట్లో తొలుత బూస్టర్ విజయవంతంగా భూమికి చేరుకుంది. లాంచ్‌ప్యాడ్ వద్దకే అది తిరిగి చేరుకోవడం విశేషం. మరోవైపు.. స్పేస్‌క్రాఫ్ట్ తన ప్రయాణాన్ని కొనసాగించి, హిందూ మహాసముద్రంలో విజయవంతంగా దిగింది.