మరాథాన్ పరుగు అంటే చాలు ఆఫ్రికా దేశాల అథ్లెట్లదే అగ్రస్థానం. తాజాగా కెన్యా అథ్లెట్ రుత్ చెప్నెగెటిక్ సరికొత్త చరిత్ర సృష్టించింది.
చికాగో మారథాన్ 42.19 కిలోమీటర్ల పందెంలో బరిలోకి దిగిన ఆమె ట్రాక్ మీద తనసత్తువకు తిరుగులేదని చాటుతూ వరల్డ్ రికార్డు బద్ధలు కొట్టింది. అదికూడా ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోకుండానే ఆమె రికార్డు బ్రేక్ చేయడం విశేషం.