టి20 క్రికెట్లో జింబాబ్వే జట్టు అత్యున్నత రికార్డు సంపాదించింది. ఏ బలమైన జట్టు అందుకొని రికార్డును కొల్లగొట్టింది జింబాబ్వే జట్టు. టి20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసి రికార్డు సృష్టించింది. కేవలం 20 ఓవర్లలోనే ఏకంగా 344 పరుగులు చేసింది జింబాబ్వే. అంతర్జాతీయ టి20 క్రికెట్లో ఇది అత్యధికం. టి20 ప్రపంచ కప్ సబ్ రీజనల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నీలో… ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ టోర్నీలో భాగంగా గాంబియాపై జింబాబ్వే తలపడింది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నాలుగు వికెట్లు నష్టపోయి ఏకంగా 344 పరుగులు చేసింది. ఇందులో జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రాజా 43 బంతుల్లో 133 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు అలాగే 15 సిక్స్ లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జింబాబ్వే జట్టు తరఫున అంతర్జాతీయ సెంచరీ చేసిన రికార్డు కూడా సికిందర్ రాజా పేరుతో చరిత్రకెక్కింది.
అయితే 345 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో గాంబియా అత్యంత దారుణంగా ఓడి పోయింది. జింబాబ్వే చేతులో 290 పరుగుల తేడాత గాంబియా ఓటమిపాలైంది. చేజింగ్ లో 14.4 ఓవర్లు ఆడిన గాంబియా కేవలం 54 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో జింబాబ్వే రికార్డు స్థాయి విక్టరీని అందుకుంది. ఇది ఇలా ఉండగా అంతర్జాతీయ టి20 లలో జింబాబ్వే తర్వాత నేపాల్ రికార్డులో ఉంది. మంగోలియా పై 2023లో 314 పరుగులు చేసింది నేపాల్. ఆ తర్వాత బంగ్లాదేశ్ పై 2024లో 297 పరుగులు చేసింది టీమిండియా. అలాగే 2024 సంవత్సరంలో సి సేల్స్ పై 286 పరుగులు చేసి జింబాబ్వే రికార్డు సృష్టించింది.