నిత్యం వేగంగా నడిచే అలవాటు అనేది ఆరోగ్యానికి ఉపయోగపడే ఒక శక్తివంతమైన సాధనం అని ఢిల్లీలోని సీకే బిర్లా హాస్పిటల్ వైద్యుడు సురేందర్ పాల్ సింగ్ చెప్పారు. క్రమం తప్పకుండా రోజూ 2 కిమీ వేగంగా నడవటం గుండె, ఊపిరితిత్తులను బలోపేతం చేస్తుందని ఆయన తెలిపారు. ఇది రక్తపోటును తగ్గించడానికి కూడా దోహదపడుతుందన్నారు. అలాగే కీళ్లు దృఢమవుతాయని, కీళ్లు పట్టేయడం వంటి సమస్యలు తగ్గుతాయని చెప్పారు.