ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రస్తుత డబ్ల్యుటీసీలో 50 వికెట్లు తీసిన జడెజా

sports |  Suryaa Desk  | Published : Sat, Nov 02, 2024, 09:46 PM

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో రవీంద్ర జడేజా తొమ్మిది వికెట్లు తీసి అరుదైన ఘనత అందుకున్నాడు. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన మూడో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో జడెజా 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఈ క్రమంలో ప్రస్తుత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటీసీ)లో 50 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.రవిచంద్రన్ అశ్విన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో భారత ఆటగాడిగా రికార్డ్ నమోదు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ మూడు, వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్ చెరో వికెట్ చొప్పున తీశారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. ప్రస్తుతం న్యూజిలాండ్ 143 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే కివీస్ చేతిలో ఒకే వికెట్ ఉంది. రేపు కివీస్‌ను 150 పరుగులకు కట్టడి చేస్తే భారత్ లక్ష్యం తక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com