పళ్లను ఎంత శుభ్రంగా క్లీన్ చేసినా కొందరిలో నోటి దుర్వాసన వస్తుంది. రోజుకు రెండు సార్లు కూడా బ్రెష్ చేస్తూ ఉంటారు. నోటి దుర్వాసన కారణంగా నలుగురిలో మాట్లాడేందుకు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.అయితే ఈ చిట్కాలు పాటిస్తే.. నోటి దుర్వాసన మాయం అవుతుంది.జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా నోటి దుర్వాసన వస్తుంది. అలాగే నోట్లో బ్యాక్లీరియా ఉండటం వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.నోటి దుర్వాసనను తగ్గించ్చేందుకు ఇంట్లోనే ఎన్నో చిట్కాలు ఉన్నాయి. నోటి దుర్వాసనతో బాధ పడేవారు.. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, జీలకర్ర, ధనియాలు, సోంపు, లవంగాలు నములుతూ ఉండటం వల్ల బెస్ట్ రిలీఫ్ ఉంటుంది.జామాకులు, యూకలిప్టస్, తులసి ఆకులు నమిలినా నోటి దుర్వాసన తగ్గుతుంది. అలాగే నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా బయటకు పోతాయి. భోజనం చేసిన తర్వాత లవంగా లేదా పుదీనా, కొత్తిమీర నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండాలి.నోటి దుర్వాసన ఉండే వారు పెరుగు, మజ్జిగా ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు తిన్నా.. నోట్లో లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయి నోటి దుర్వాసన తగ్గుతుంది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది.