ఈనెల 10న విజయవాడలో ఎంబి విజ్ఞాన కేంద్రం రాఘవయ్య పార్కు సమీపంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ పేర్కొన్నారు.
ఈ మేరకు బుధవారం పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద కార్యక్రమ కరపత్రాలను వారు ఆవిష్కరించారు. రాష్ట్ర సదస్సులను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.