ప్రతి కార్యకర్తకు టీడీపీ సభ్యత్వం వజ్రం లాంటిదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం కోసిగి మండలం దోడ్డి బెళగల్ గ్రామంలో టీడీపీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ సభ్యత్వం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, రూ. 5 లక్షల ఇన్సూరెన్స్, ఉన్నత చదువులకు అనేక ప్రయోజనాలు పొందవచ్చునని అన్నారు.