సీతాఫలం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సీతాఫలాలలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ కూడా సమృద్దిగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం కంటెంట్ మెరుగ్గా ఉంటుంది. ఇది చిన్నతనంలోనే దృష్టిలోపాలు, కళ్లలో మచ్చలు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలు తగ్గిచండలో సహాయపడుతుంది. ఇవి శరీర రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు.