* కొర్రలతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
* కొర్రల్లో మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, రైబోఫ్లేవిన్తో పాటు అధిక మొత్తంలో పీచు పదార్థం కలిగి ఉంటుంది.
* కొర్రలు తినడం వల్ల ఉదర సంబంధ వ్యాధుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
* కడుపునొప్పి, మూత్రంలో మంట, ఆకలి లేకపోవడం, అతిసారం వంటి సమస్యలు దూరమవుతాయి.
* ఏకాగ్రత పెరుగుతుంది.
* ముఖ్యంగా కొర్రల్లో ఉండే ప్రోటీన్.. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది.