కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం భక్తులతో కిక్కిరిసింది. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు తెల్లవారుజాము మూడు గంటల నుంచి వ్రతాలు, సర్వదర్శనాలు భక్తులకు కల్పించారు. భక్తుల రద్దీతో టిక్కెట్ తీసుకున్నవారికి దర్శనం గంట సమయం.. సాదరణ దర్శనం రెండు గంటలు సమయం పడుతుంది. అలాగే ముమ్మిడివరం శ్రీ ఉమా సూరేశ్వర స్వామి, మురమళ్ల శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి, కుండళేశ్వరం శ్రీ పార్వతీ కుండళేశ్వర స్వామి ఆలయాలతో పాటు పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.