ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రతి రోజు మధ్యాహ్నం అందించే భోజనంలో మార్పులు జరగనున్నాయి. రాష్ట్రంలోని ప్రాంతాల వారీగా ప్రజల అలవాట్లను పరిగణనలో తీసుకున్న ప్రభుత్వం మెనూను రూపొందించింది. ఈ మేరకు ఉత్తరాంధ్ర ప్రజల అలవాట్ల మేరకు వారానికి నాలుగు రోజులు వైట్ రైస్‌తో కూడిన భోజనం అందిస్తారు.
సోమవారం వైట్‌రైస్, తోటకూరపప్పు, ఉడకబెట్టిన గుడ్డు, శనగపప్పు చిక్కీ, మంగళవారం వైట్ రైస్, గుడ్డు కూర, రసం, రాగి జావ, బుధవారం వెజ్ పలావ్, బంగాళదుంపల కుర్మా, ఉడకబెట్టిన గుడ్డు, శనగపప్పు చిక్కీ, గురువారం వైట్‌రైస్, సాంబారు, గుడ్డుకూర, రాగి జావ, శుక్రవారం చింతపండుతో పులిహోర, వెజిటిబుల్స్/గోంగూర చట్నీ, ఉడకబెట్టిన గుడ్డు, శనగపప్పు చిక్కీ, శనివారం వైట్ రైస్, వెజిటబుల్ కర్రీ, రసం, రాగి జావ, స్వీట్ పొంగల్ ఇవ్వాలని ప్రతిపాదించారు.
ఉత్తరాంధ్రలోని ఆరు జిల్లాలకు రూపొందించిన ఒకే విధమైన మెనూ రూపొందించారు. దీనిని ఈ నెల 14 నుంచి అమలుచేయాలని ప్రతిపాదించారు. అదేరోజు మెగా టీచర్, పేరెంట్స్ సమావేశానికి సన్నాహాలు చేశారు. కానీ ఈ సమావేశం వచ్చేనెలకు వాయిదా పడిది. ఈ నేపథ్యంలో కొత్త మెనూ ఎప్పుడు అమల్లోకి వచ్చేదీ త్వరలో చెబుతామని విద్యాశాఖ వెల్లడించింది.