చియావిత్తనాలు విటమిన్లు, ఖనిజాలు, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్, ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి.ఇవన్నీ శరీరానికి చాలా మేలు చేస్తాయి. రోజుకు ఒక గ్లాసు చొప్పున ప్రతి రోజూ అల్లంతో పాటు చియా వాటర్ ను తీసుకుంటే అపారమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.ఫైబర్ పుష్కలంగా ఉండే నీటిలో అల్లం కలిపి చియా సీడ్స్ తాగడం వల్ల పొట్టలోని కొవ్వును కరిగించి, ఆకలిని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే నీటిలో నానబెట్టిన చియా గింజలను తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అల్లంలోని జింజెరాల్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో మేలు చేస్తుంది.
రోజుకు ఒక గ్లాసు చొప్పున ప్రతి రోజూ అల్లంతో పాటు చియా వాటర్ ను తీసుకుంటే అపారమైన ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి. చియా సీడ్ వాటర్‌ను అల్లం కలిపి తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. చియా విత్తనాలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌ల స్టోర్‌హౌస్. కాబట్టి వీటిలో నానబెట్టిన నీటిని తాగడం వల్ల గుండె ఆరోగ్యానికి, మెదడు ఆరోగ్యానికి మంచిది. చియా గింజల్లో కాల్షియం,యు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీటిని నానబెట్టి తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.అల్లం రసంతో తయారు చేసిన చియా వాటర్ లో ఫైబర్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, విటమిన్లు, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అల్లంరసం చియా సీడ్స్‌తో తయారు చేసిన ఈ పానీయం బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. అల్లం థర్మోజెనిక్ ప్రభావాలు, చియా విత్తనాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కేలరీలను కాల్చడంలో సహయపడుతుంది. ఆకలిని నియంత్రిస్తుంది.బ్లడ్‌షుగర్ ఉన్నవారికి ఈ డ్రింక్ ఎనర్జీటిక్‌గా పనిచేస్తుంది. జింజర్ చియా వాటర్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల ఈ వాటర్ జీర్ణక్రియ క్రమబద్ధతను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా అల్లంరసం, చియా వాటర్ శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్, గుండె జబ్బులకు అడ్డుకట్ట వేస్తుంది. సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది.
అర అంగుళం అల్లం ముక్కను తీసుకుని తొక్క, మట్టి ఉంటే తీసేసి సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో అల్లం తురుము వేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్ వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కపెట్టుకోవాలి. ఆ తర్వాత మీ రుచికి తగిన మోతాదులో తేనె కలిపితే జింజర్ చియా వాటర్ రెడీ