కొబ్బరి నీళ్లల్లో తులసి ఆకులను వేసుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. తీవ్రమైన ఒత్తిడి, డిప్రెషన్ నుంచి దూరం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడేవారు రోజూ తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.మాములుగా కొబ్బరి నీళ్లను తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. శరీరానికి కావాల్సిన విటమిన్స్ అన్ని పుష్కలంగా అందుతాయి.. ఇక తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో సమస్యలను దూరం చేస్తుంది.. ఒక గ్లాస్ కొబ్బరి నీటిలో తాజా తులసి ఆకులు లేదా తులసి రసం వేసి బాగా కలిపి రోజులో ఏ సమయంలోనైనా తాగవచ్చు.. వీటిని తీసుకోవడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..ఇలా తాగడం వల్ల ఒత్తిడి,ఆందోళన వంటివి తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది. మనలో చాలా మంది మారిన పరిస్థితులకు తీవ్రమైన ఒత్తిడి,డిప్రెషన్ కి గురి అవుతున్నారు..