బైకులను ఉద్దేశపూర్వకంగా దగ్ధం చేసిన వారిని అరెస్ట్ చేసినట్లు గురజాల డీఎస్పీ జగదీశ్ గురజాల తమ కార్యాలయంలో మంగళవారం వెల్లడించారు. మాచర్ల పట్టణంలోని 31వ వార్డులో ఈనెల 16న వైసీపీకి చెందిన పోలేపల్లి ఆనంద్, టీడీపీకి చెందిన ఆలేటి లక్ష్మయ్య వాహనాలు కాలిపోయాయి. అదే ప్రాంతానికి చెందిన ఆదిరాల కిషోర్ బాబు, ఊరే మరియ బాబు, వేల్పుల చాణిక్య పథకం ప్రకారం తగలబెట్టి వారి మధ్య వివాదాలు సృష్టించేందుకు కుట్రలు చేశారు.