ఈ ఏడాది డిసెంబరు 31 నాటికి జిల్లాలో పేదలకు మంజూరైన ఇళ్లలో 5, 650 ఇళ్లను నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు అధికారులను ఆదేశించారు. ఏడాది పూర్తయ్యేనాటికి 15, 800 ఇళ్లకు స్టేజ్ కన్వర్షన్ చేయాలన్నారు.
మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు వారం వారం లక్ష్యాలు నిర్దేశించుకుని ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. మంగళవారం నరసరావుపేట స్థానిక కలెక్టరేట్ లోని జాషువా సమావేశ మందిరంలో నిర్వహించారు.