జాతీయ రహదారుల నిర్మాణాల పూర్తికి ప్రతి ఒక్కరు సహకరించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి కోరారు. మంగళవారం పాములపాడు మండలంలోని 340 సి జాతీయ రహదారి (కర్నూలు నుండి దోర్నాల) నిర్మాణ పనులను జాయింట్ కలెక్టర్ సి విష్ణు చరణ్, జాతీయ రహదారుల అధికారుల బృందంతో కలిసి కలెక్టర్ పర్యవేక్షించారు. ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ అధికారి నాగజ్యోతి, సంబంధిత మండల తాసిల్దార్లు కలెక్టర్ వెంట ఉన్నారు.