ఏపీ ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు గట్టి సంకల్పంతో ఉన్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. దీని కోసం కేంద్రం ఇచ్చిన జల జీవన్ మిషన్ నిధులను పూర్తి స్థాయిలో వినియోగిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ప్రజలకు ఇంకా సురక్షిత నీరు అందడం లేదన్నారు. తిరువూరు, కనిగిరి, ఉదయగిరి, ఉద్దానం సహా మరిన్ని ప్రాంతాల్లో ప్రజలకు సురక్షిత నీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు.