చీరాల మార్కెట్ సెంటర్ లో బుధవారం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలను వన్ టౌన్ సీఐ శ్రీనివాసరావు చేపట్టారు. ఇందులో భాగంగా ఆయన ట్రాఫిక్ సిబ్బందితో కలిసి ఆ సెంటర్ లో ట్రాఫిక్ కి అంతరాయం కలిగిస్తున్న అంశాలను పరిశీలించారు. వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని సీఐ శ్రీనివాసరావు చెప్పారు. ఆ ప్రాంతంలో ఉన్న వెండర్లు, ఇతర వ్యాపారులు పోలీసులకి సహకరించాలని ఆయన కోరారు.