అన్ని రంగాల్లో విభిన్న ప్రతిభావంతులు రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు అన్నారు. విభిన్న ప్రతిభావంతులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అందుకోవాలనే ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలని ఆకాంక్షించారు.
డిశంబరు 3వ తేదీన జరుగనున్న ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి విభిన్న ప్రతిభా వంతులప్రతిభావంతుల ఆటల పోటీలను శ్రీకాకుళం ఆర్ అండ్ బి డచ్ భవనం వద్ద ఆయన బుధవారం ప్రారంభించారు.