పెనుకొండ మండలంలోని న్యాయవాదులు బుధవారం తమ విధులను బహిష్కరించారు. రాష్ట్ర వైసీపీ లీగల్ సెల్ జాయింట్ సెక్రెటరీ నాగరాజు మాట్లాడుతూ రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తామని గత ప్రభుత్వాలు హామీ ఇచ్చాయని తెలిపారు. కొంతవరకు పనులు జరిగే సమయంలో ప్రభుత్వం మారిందని, ఇప్పుడు అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కనిపిస్తోందని చెప్పారు. రాయలసీమలోనే హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.