ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరం

national |  Suryaa Desk  | Published : Wed, Nov 20, 2024, 03:07 PM

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎయిర్సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు గతంలో ఉత్తర్వులను ఇచ్చింది.ఈ ఉత్తర్వులను చిదంబరం హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఆయనపై విచారణకు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది.ఎయిర్సెల్ - మాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై ట్రయల్ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌లు దాఖలు చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని చిదంబరం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా హైకోర్టు ఈ విచారణను నిలిపివేసింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com