బెంగళూరు రాజాజీనగర్‌లోని ఓ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్‌లో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో రిసెప్షనిస్ట్ ప్రియ (20) సజీవ దహనం అయింది.
కాగా బుధవారం (నవంబర్ 20) ఆమె పుట్టిన రోజు. దానికి ఒక రోజు ముందు జరిగిన అగ్నిప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈవీ బైక్ బ్యాటరీల్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.