విద్యుత్ సేవలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ఈపీడీసీఎల్ అధికారులు కొత్తగా స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ చౌర్యానికి చెక్ పెట్టడంతోపాటు మీటరు రీడింగ్ ఆన్లైన్ చేయడానికి ఇది దోహదపడుతుంది. పట్టణ ప్రాంతాల్లో వాణిజ్య కేటగిరీలకు, ప్రభుత్వం కార్యాలయాలు, సంస్థలకు ఇప్పటికే స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం కాగా.. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్మార్ట్ మీటర్లను బిగిస్తున్నారు. మండల కేంద్రమైన కోటవురట్లలో నెల రోజుల నుంచి వాణిజ్య విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి పథకాలు, వీధి దీపాలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా వీటిని బిగిస్తున్నారు.