పింఛన్‌దార్లకు శుభవార్త. పింఛన్ ఇచ్చే సమయంలో అందు బాటులో లేకపోయినా,ఏదైనా ఊరెళ్లినా, మూడు నెలలకోసారి తీసుకోవచ్చు. కానీ మూడో నెల కూడా పింఛన్ తీసుకోవడానికి అందుబాటులో లేకపోతే అది రద్దవుతుంది. మళ్లీ నాల్గో నెలలో అందుబాటులోకి వస్తే కొత్త పింఛన్ మాత్రం ఇస్తారు. బకా యిలు ఇవ్వరు.ఈ మేరకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) జి.వీరపాండ్యన్ ఉత్తర్వులు జారీ చేసినట్టు డీఆర్డీఏ పీడీ మూర్తి తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశాల మేరకు ఇది ఈ నెల 1 నుంచే అమల్లోకి వచ్చినట్టు పరిగణిస్తారన్నారు.
ఒక నెల పింఛన్ తీసుకోకపోతే పింఛన్‌దారుడు తాత్కాలికంగా వలసవెళ్లినట్టు భావించి, రెండో నెల పింఛన్‌తో పాటు ఒకటో నెల బకాయి ఇస్తామన్నారు. వరసగా రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో రెండు నెలల బకాయితో పాటు మొత్తం 3 పింఛన్ల సొమ్ము తీసుకో వచ్చని చెప్పారు. కానీ వరుసగా మూడు నెలల పాటు పింఛన్ తీసుకోకపోతే మొత్తం రద్దవుతుందని చెప్పారు.ఒక వేళ పిం ఛన్దారు తర్వాత నెలలో వస్తే సచివాలయ వేల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్సెక్రటరీ, ఎంపీడీవో ద్వారా కొత్తపెన్షన్ పొందవచ్చ న్నారు. కానీ పాత నెలల పింఛన్‌కు అర్హత ఉండదన్నారు.