తమకు చెల్లించాల్సిన పది నెలల బకాయిలను తక్షణమే చెల్లించాలని గ్రీన్ అంబాసిడర్లు కోరారు. ఈ మేరకు గురువారం సీతానగరం స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి యమ్మల మన్మథరావు, మండల కార్యదర్శి గవర వెంకటరమణ మాట్లాడు తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2015లో స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా గ్రీన్ అంబాసిడర్లను నియమించా యని చెప్పారు. మొదట్లో వీరికి స్వచ్ఛభారత్ కార్పొరే షన్ ద్వారా జీతాలు చెల్లించేవారని, తర్వాత పంచాయతీలకు అప్పగించడంతో వీరికి కష్టాలు మొదలయ్యాయన్నారు. పంచాయతీలు సక్రమంగా జీతాలు చెల్లించడం లేదన్నారు. గ్రీన్ అంబాసిడ్ల వేతనాలు చెల్లించని ఎడల భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ అంబాసిడర ్ల మండల అధ్యక్షు డు జలుమూరు గౌరు, గుంట పోలయ్య, తోట రాము, తదితరులు పాల్గొన్నారు.