విద్యుత్ కొనుగోలకు అప్పటి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుందని, మధ్యలో అదానీ ఎందుకు వచ్చారని వైయస్ఆర్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తక్కువ ధరతో సెకీతో ప్రభుత్వ ఒప్పందం చరిత్రాత్మకమన్నారు.
దాని వల్ల ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు , అలా 25 ఏళ్లలో దాదాపు లక్ష కోట్లు ప్రభుత్వానికి ఆదా అవుతుందన్నారు. అదానీ విషయంలో వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్‌పై బురదజల్లే ప్రయత్నం జరుగుతోందని,అయన వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై ప్రచారంలో ఉన్నవన్నీ అభూతకల్పనలేనని కొట్టి పారేశారు.