ఏపీలో పత్తి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, పత్తి కొనుగోలులో జాప్యం జరుగుతోందని వైయస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో సోమవారం(నవంబర్ 25) ఆయన ఒక పోస్టు చేశారు. ‘పత్తి ధరలు పడిపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కేవలం 20 పత్తి కొనుగోలు కేంద్రాలు మాత్రమే పనిచేస్తున్నాయి.కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. కొంత తేమ ఉన్న పత్తిని కూడా కొనుగోలు చేసేలా సీసీఐకి ఆదేశాలు ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు.