చలికాలంలో చాలా మంది దగ్గు, జలుబు, గొంతు నొప్పి, వైరల్ ఫీవర్‌తో బాధ పడుతుంటారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా చాలా వరకు తగ్గిపోతుంటుంది. వాటిని తగ్గించుకునేందుకు, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు రకరకాలా ట్యాబెట్ల్స్ వినియోగిస్తుంటారు.అయితే శీతాకాలంలో వచ్చే ఈ సమస్యలను తగ్గించేందుకు, వాటి నుంచి ఉపశమనం పొందేందుకు వాము ఎంతగానో ఉపయోగపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మార్కెట్‌లో కేవలం 2 రూపాయలకు కూడా దొరికేస్తూ ఉంటుంది.కాగా, వామును సాధారణంగా ఆహారాన్ని సిద్ధం చేసే క్రమంలో వినియోగిస్తుంటాము. ఇవి జీర్ణ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. కానీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి సమస్యలను కూడా పరిష్కరిస్తుందని చాలా మందికి తెలియదు. వామును తీసుకుంటే ఏ విధమైన ప్రయోజనాలు ఉంటాయి?, ఏ విధంగా వాము తీసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
వాము జలుబు, దగ్గును ఏ విధంగా తొలగిస్తుందంటే?
వాములో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గొంతులో వాపును తగ్గిస్తుంది. అలాగే గొంతులో గరగరకు కారణమయ్యే వాటిని కూడా పరిష్కరిస్తుంది. తద్వారా దగ్గు అనేది తగ్గిపోతుంది. వాము అనేది ఒక ఎక్స్‌పెక్టోరెంట్. ఇది చాతిలోనే కఫాన్ని తొలగించడానికి చాలా సహాయపడుతుంది. వాములు తీసుకోవడం వల్ల దగ్గుతో పాటు కఫము కూడా తగ్గిపోతుంది.
బ్యాక్టీరియాల నాశనం కోసం..
వాములో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతుంది. దీని ద్వారా జలుబు తగ్గిస్తుంది. అలాగే వాములో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. వాము తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియాపై పోరాడేందుకు కావాల్సిన శక్తి లభిస్తుంది.
వామును ఎలా ఉపయోగించాలంటే?
వామును వివిధ పద్ధతుల్లో వినియోగించుకోవచ్చు. వాము నీరు తాగడం, వంటల్లో వేసుకోవడం, పొడిగా చేసి తినడం, నెయ్యితో కలిపి కూడా తీసుకోవచ్చు. వివిధ మార్గాల్లో వామును తీసుకోవడం వల్ల ప్రయోజనాలు సమానంగా ఉంటాయి.
క గ్లాస్ నీటిలో ఒక స్పూన్ వాము వేసుకొని, ఆ నీటిని మరిగించి తాగడం వల్ల జీర్ణ సమస్యలు, కడుపు ఉబ్బరం, తేన్పులు వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే వామును వంటల్లో జత చేసుకోవడం వల్ల ఆ వంటలకు ప్రత్యేకమైన రుచి వస్తుంది. దీంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు జరుగుతుంది. వామును పొడిగా చేసి, నల్ల ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల కడుపునొప్పి తగ్గిపోతుంది.
వాముపొడిని నెయ్యితో కలిపి తీసుకోవడం నెలసరి సమయంలో వచ్చే సమస్యలన్నీ దూరమవుతాయి. అలాగే వాములో నుంచి తీసిన నూనెను చెవిలో చుక్కలుగా కూడా ఉపయోగించుకొవచ్చు.
ఎంత తీసుకోవాలి?
వాముతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ పరిమితంగా ఆ వామును తీసుకోవాల్సి ఉంటుంది. వామును అధికంగా తీసుకోవడం వల్ల కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. కొంతమంది వాము అలర్జీ ఉంటుంది. అందుకే దీనిని తీసుకునే ముందు సంబంధిత వైద్యులను లేదా నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది. ఆరోగ్య సమస్య మరీ ఎక్కువగా ఉంటే కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.