ఉత్తరప్రదేశ్ జలౌన్ జిల్లాలో 32 ఏళ్ల వివాహిత, 40 ఏళ్ల ఆమె ప్రియుడు గురువారం రాత్రి హత్యకు గురయ్యారు. వారు నగ్నంగా ఇంట్లో శృంగారం చేస్తూ చిక్కడంతో ఆ మహిళ భర్త గొడ్డలితో ఇద్దరినీ నరికి చంపాడని పోలీసులు తెలిపారు.
ఈ సమయంలో ఆ దంపతుల 10, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఇంట్లోని పక్క గదిలో నిద్రిస్తున్నారు. గొడవ వల్ల మేల్కొన్న వారు, కేకలు వేస్తూ బయటకు పరుగులు తీయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు.