దేశంలో మధుమేహం ‘మహమ్మారి’లా వ్యాపిస్తున్నది. ఏటికేడాది దాని బారిన పడుతున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ప్రముఖ డయాగ్నస్టిక్స్ సంస్థ థైరోకేర్ చేసిన అధ్యయనంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. ‘ప్రిడయాబెటిస్, డయాబెటిస్ ఇన్ ఇండియా’ పేరుతో థైరోకేర్ సంస్థ దేశవ్యాప్తంగా19,66,449 మంది నుంచి బ్లడ్ శాంపిళ్లను సేకరించి హెచ్‌బీఏ1సీ టెస్టులు చేసింది. ఈ జాబితాలో తెలంగాణ టాప్‌టెన్‌లో ఉన్నట్టు వెల్లడించారు.