మరో 20 రోజుల్లో కొత్త ఏడాది రానుంది. ఇదిలా ఉంటే 2024లో భారతీయులు ఎక్కువగా సెర్చ్ చేసిన అంశాలను గూగుల్ వెల్లడించింది. అందులో వరుస పరంగా చూస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్, టీ20 వరల్డ్ కప్, బీజేపీ, 2024 ఎన్నికల ఫలితాలు, 2024 ఒలింపిక్స్, అధిక వేడి, రతన్ టాటా, కాంగ్రెస్, ప్రో కబడ్డీ, ఇండియన్ సూపర్ లీగ్ గురించి అత్యధిక మంది సెర్చ్ చేసినట్లు జాబితాను విడుదల చేసింది.