భారతదేశంలో Xiaomi కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ కోసం నిరీక్షణకు తెరపడింది. ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ షావోమీ.. రెడ్మీ నోట్ 14 సిరీస్‌లో (కొత్త ఫోన్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ సిరీస్ కింద మూడు కొత్త స్మార్ట్ఫోన్లు - రెడ్మీ నోట్ 14, రెడ్మీ నోట్ 14 ప్రో, రెడ్మీ నోట్ 14 ప్లస్ ఉన్నాయి. ఈ ఫోన్లు డిసెంబర్ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. రెడ్మీ నోట్ 14ని అమెజాన్‌లో విక్రయించనున్నారు. మిగిలిన రెండు ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తాయి. వీటితో పాటు ఎంఐ.కామ్, షావోమి రిటైల్ స్టోర్లలో పొందొచ్చు. ఈ ఫోన్ల ధరలు, స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే..
రెడ్మీ నోట్ 14
ఇది రెడ్మీ నోట్ 14 సిరీస్‌లో స్టార్టింగ్ మోడల్. ఇది 6.67 అంగుళాల అమోలెడ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేటు, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్ అమర్చారు. అలాగే.. 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ సెకండ్ కెమెరా అందుబాటులో ఉంది. ముందు వైపు 16 ఎంపీ కెమెరా ఉంది. పవర్ బ్యాకప్ కోసం 5110mAh బ్యటరీ కలిగి ఉంటుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ధరల విషయానికొస్తే.. 6జీబీ+128జీబీ - రూ.17,999.. 8జీబీ+128జీబీ- రూ.18,999.. 8జీబీ+256జీబీ- రూ.20,999గా నిర్ణయించారు.
రెడ్మీ నోట్ 14 ప్రో
ఈ మోడల్ రెడ్మీనోట్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7,300 అల్ట్రా ప్రాసెసర్‌ను పొందు పరిచారు. 50MP+8MP+2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేశారు. అంటే వెనుకవైపు 50 ఎంపీ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. 2 ఎంపీ మ్యాక్రో సెన్సర్ అమర్చారు. ముందువైపు ఏఐ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5500mAh బ్యాటరీ ఇచ్చారు. ఇక ధరల విషయానికొస్తే.. 8జీబీ+128జీబీ- రూ.23,999.. 8జీబీ+ 256జీబీ- రూ.25,999గా నిర్ణయించారు.
రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్
రెడ్మీ నోట్ 14 సిరీస్‌లో హైఎండ్ మోడల్ ప్రో ప్లస్. ఇది 6.67 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే కలిగి ఉంది. 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఇచ్చారు. ఇందులో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జనరేషన్ 3 ప్రాసెసర్‌ను అమర్చారు. ఇందులోనూ ట్రిపుల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఈ సిరీస్‌లోని అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ 50MP+12MP+50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వచ్చింది. అంటే 50 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 ఎంపీ టెలిఫొటో లెన్స్ అమర్చారు. ముందు ఏఐ కెమెరా అమర్చారు. 6200mAh బ్యాటరీకి 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. ధరల విషయానికొస్తే.. 8జీబీ+128జీబీ - రూ.29,999.. 8జీబీ+256జీబీ- రూ.31,999.. 12జీబీ+512జీబీ- రూ.34,999గా నిర్ణయించారు.