శ్రీకాకుళం జిల్లా, పొలాకి మండలం పిరియా గ్రహారానికి చెందిన కొండ దుర్గాప్రసాద్ (24) పురుగుల మందు తాగి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. దుర్గాప్రసాద్ సోమవారం రాత్రి హరిశ్చంద్రపురం రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో ఉండడంతో గమనించిన స్థానికులు వెంటనే 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మధ్యా హ్నం మృతి చెందాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ శంకరరావు తెలిపారు.