వాకింగ్.. ఇది చూడ్డానికి సింపుల్‌గా కనిపించినా ఎఫెక్టివ్ ఎక్సర్‌సైజ్. ఈ వాకింగ్ వాల్ల చాలా లాభాలు ఉన్నాయి. అయితే, కొంతమంది ఉదయం నడిస్తే మరికొంత మంది వారి వీలుని బట్టి సాయంత్రాలు నడుస్తారు. ఈ రెండింటి వల్ల డిఫరెంట్ లాభాలు ఉన్నాయి. ఎప్పుడు నడిస్తే ఏయే లాభాలున్నాయో వాటి గురించి తెలుసుకుని మీకు వీలయ్యే విధంగా నడవండి.
ఉదయం నడిస్తే..
ఉదయాన్నే నడవడం వల్ల మెటబాలిజం బూస్ట్ అవుతుంది.
బాడీలోని కేలరీలు బర్న్ అవుతాయి.
దీని వల్ల రోజంతా యాక్టివ్‌గా, పాజిటీవ్‌గా ఉంటాం.
మనం ఎండలో నడుస్తాం కాబట్టి విటమిన్ డి కూడా దొరుకుతుంది. దీని వల్ల హ్యాపీగా నిద్ర పడుతుంది.
ఉదయం వచ్చే సన్‌లైట్ కారణంగా సెరోటోనిన్ రిలీజ్ అవుతుంది. దీంతో ఒత్తిడి, స్ట్రెస్, యాంగ్జైటీ సమస్యలు దూరమై హ్యాపీగా ఉంటారు.
ఉదయాన్నే వాకింగ్ లాంటి వర్కౌట్స్ చేయడం వల్ల బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది. బ్లడ్ ఫ్లో పెరుగుతుంది. బ్రెయిన్‌కి ఆక్సీజన్ అంది మెదడు పనితీరు బాగుంటుంది. అదే విధంగా, ఉదయాన్నే ఎయిర్ పొల్యూషన్ తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఫ్రెష్ వాతావరణంలో మీరు వాకింగ్ చేసినట్లుగా ఉంటుంది.
సాయంత్రం నడిస్తే..
ఉదయం వీలు కాని వారు సాయంత్రాలు నడుస్తుంటారు. దీని వల్ల ముఖ్యలాభం ఏంటంటే.. నిద్ర సమస్యలు దూరమై హ్యాపీగా నిద్రపోతారు. సాయంత్రాలు నడవడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. మైండ్ క్లియర్‌గా మారుతుంది. రోజంతా పనిచేసి అలసిన శరీరం రిలాక్స్ అవుతుంది. డిన్నర్ తర్వాత నడవడం వల్ల జీర్ణమవుతుంది. దీంతో జీర్ణ సమస్యలు కూడా దూరమై జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది. అదే విధంగా, ఉదయాల్లో పనుల్లో బిజీగా ఉండి ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయని వారు ఈవెనింగ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కానీ, ఫ్రెండ్స్‌తో కానీ, హ్యాపీగా నడవొచ్చు. ఎలాంటి హడావిడి టెన్షన్ లేకుండా హ్యాపీగా కూల్ క్లైమెట్‌లో నడుస్తారు.
ఏది బెటర్..
ఏ టైమ్‌లో నడవాలనేది పర్సనల్ ప్రిఫరెన్స్, లైఫ్‌స్టైల్ విధానాన్ని బట్టి ఉంటుంది. కొంతమందికి ఉదయం వీలు కాదు. అలాంటి వారు సాయంత్రాలు నడవొచ్చు.
మీకు ఏ టైమ్ వీలవుతుందో ముందుగా డిసైడ్ చేసుకోండి. ఆ టైమ్‌కి రోజు నడిచేలా చూడండి.
మీరు మెటబాలిజాన్ని బూస్ట్ చేసుకుని రోజంతా యాక్టివ్‌గా ఉండాలనుకుంటే మార్నింగ్ నడవండి.
ఒత్తిడి తగ్గి హ్యాపీగా ఉండాలనుకుంటే సాయంత్రాలు నడవండి.
మీరుండే ఏరియాల్లో పొల్యూషన్‌ని బట్టి కూడా ఎప్పుడు నడిస్తే మంచిదో తెలుసుకోండి.
మీరు ఒక్కరే కాకుండా గ్రూప్‌గా నడవాలనుకుంటే సాయంత్రాలు నడవండి. ఎందుకంటే సాయంత్రాలు చాలా మంది ఫ్రీగా ఉంటారు.
మీకు నిద్ర సమస్యలు లాంటివి ఉన్నా కూడా సాయంత్రం నడవడం వల్ల ఆ సమస్యలు దూరమవుతాయి.
ఈ తప్పులు చేయొద్దు..
అదే విధంగా, నడిచేటప్పుడు కొన్ని మిస్టేక్స్‌ని అవాయిడ్ చేయాలి. అవేంటంటే..
మీ తల, భుజాలు స్ట్రెయిట్‌గా ఉండాలి. కోర్ భాగాన్ని ఎంగేజ్ చేయాలి. దీంతో బ్రీథింగ్ సరిగ్గా వేస్తుంది.
అదే విధంగా, చిన్న అడుగులు నార్మల్‌గా నడిస్తే ఎలాంటి గాయాలు ఉండవు. మంచి సపోర్టివ్ షూ వేసుకోండి. దీంతో పెయిన్, జాయింట్ పెయిన్స్ రావు. కొన్నిసార్లు మన బాడీ మరీ ఇబ్బందిగా ఫీల్ అయితే కాసేపు ఆగి ఆ తర్వాత నడవండి. నడవడానికి ముందు, తర్వాత స్ట్రెచింగ్ చేయాల్సిందే దీంతో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎలాంటి గాయాలు కావు..
నడకతో..
నడక అనేది పూర్తి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది లో ఇంపాక్ట్ వర్కౌట్. ఎవరైనా నడవొచ్చు. దీని వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గుతారు. స్ట్రెస్ వంటి సమస్యలు దూరమవుతాయి. రెగ్యులర్‌గా వాక్ చేయడం వల్ల మజిల్, బోన్స్ ప్రాబ్లమ్స్ అయిన ఆస్టియోపోరోసిస్‌ని దూరం చేస్తాయి. దీని వల్ల మెంటల్ హెల్త్ బాగుంటుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా వాకింగ్‌ని మీ రొటీన్‌లో యాడ్ చేసుకోండి.
గమనిక :ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.