మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, చెర్లపాలెం జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల 10వ తరగతి విద్యార్థులకు లయన్స్ క్లబ్ తొర్రూరు టీచర్స్ ఆధ్వర్యంలో జిల్లా విద్యా శాఖధికారి ఎ రవీందర్ రెడ్ది చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా జిల్లా విద్యా శాఖధికారి ఎ రవీందర్ రెడ్ది విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ... విద్యార్థులు శ్రద్దగా చదువుకొని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పడం జరిగింది.
కాగా, ఈ కార్యక్రమం తమ్మెర శారదా లక్ష్మి,నర్సింహా రావు ఆర్ధిక సహకారం తో చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు ఎమ్. బచ్చయ్య చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో జిల్లా సైన్స్ అధికారి అప్పారావు గారు, లయన్స్ క్లబ్ ప్రతినిధులు శారదా, శ్రీదేవి, సూరం ఉపేందర్ రెడ్ది, చింతల సురేష్, వెలిదే సురేష్, రాయ్పెళ్లి యాకయ్య,తోట రమేష్, పాఠశాల ఉపాధ్యాయులు జయపాల్ రెడ్డి, యాకూబ్ అలీ, స్వర్ణలత, కవిత, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.